అంతా అప్రమత్తంగా ఉండండి.. | - | Sakshi
Sakshi News home page

అంతా అప్రమత్తంగా ఉండండి..

Aug 12 2025 8:09 AM | Updated on Aug 12 2025 12:43 PM

అంతా

అంతా అప్రమత్తంగా ఉండండి..

రద్దీలోనూ మహాలక్ష్మి రద్దీకి అనుగుణంగా సర్వీసులు

నాలుగు రోజుల్లో డిపోల వారీగా

ఆదాయం (ప్రత్యేక సర్వీసుల ద్వారా)

నాలుగు రోజుల్లో రూ.1.21 కోట్ల ఆదాయం

అత్యధికంగా మధిర నుంచి రూ.29.84 లక్షలు

9వ తేదీన ఓఆర్‌.. 112

రాజీవ్‌ స్వగృహ టౌన్‌షిప్‌ వేలం

ఖమ్మంరూరల్‌: పోలేపల్లిలోని రాజీవ్‌ స్వగృహ ఆధ్వర్యాన పూర్తయిన, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనా లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌ స్వగృహ భవన సముదాయాన్ని కలెక్టర్‌ సోమవారం పరిశీలించారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులు, బిల్డర్లతో సమావేశమై మాట్లాడారు. ఇక్కడ నివాసముండే వారికి మున్నేటి వరద నుంచి ఇబ్బంది రాకుండా రిటైనింగ్‌వాల్‌ నిర్మిస్తామని తెలిపారు. ఎనిమిది బ్లాక్‌లు, తొమ్మిది ఫ్లోర్లు, ఫ్లోర్‌కు ఎనిమిది ఫ్లాట్ల చొప్పున 576 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పారు. ఆసక్తి ఉన్న సంఘాలు, బిల్డర్లు, డెవలపర్లు సెప్టెంబర్‌ 6లోగా టెండర్‌ దాఖలు చేయాలని తెలిపారు. కాగా, మున్సిపాలిటీ వారు బఫర్‌ జోన్‌లో నిర్మాణాలను కూల్చివేస్తుండగా, మున్నేటి పక్కన స్వగృహ టౌన్‌షిప్‌ పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నించగా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో అధికారికంగా అనుమతి ఇచ్చినట్లే అవుతుందని కలెక్టర్‌ తెలిపారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, ఈఈ నరేందర్‌రెడ్డి, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో ఈనెల 14నుంచి 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందున్న వాతావరణ శాఖ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించాక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సూచనలు చేయడంతో పాటు మంగళవారం సాయంత్రంలోగా శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల జాబితా సమర్పించాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. కాగా, వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రభుత్వ వ్యతిరేక వార్తలను అధికారులు సమీక్షించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తొలుత అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్‌.. పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్‌ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని...

● వైరా మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన డి.రాంబాబు ఇంటి నంబర్‌ మంజూరు చేయాలని కోరారు.

● మధిరకు చెందిన డి. వెంకటమ్మ తన భర్త కలెక్టరేట్‌లో స్వీపర్‌గా పనిచేసిన కాలానికి ధృవీకరణ పత్రం ఇప్పించాలని కోరారు. అలాగే, కొణిజర్ల మండలం పల్లిపాడు హైస్కూల్‌ స్వీపర్‌గా పనిచేసిన వెంకటేశ్వర్లు తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

● రఘునాధపాలెం మండలం పువ్వాడనగర్‌కు చెందిన షేక్‌ బీబమ్మ, కట్ట మోహన్‌, నల్ల నీలవేణి తదితరులు తమ పేర్లు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఉన్నందున మంజూరు పత్రాలు ఇప్పించాలని కోరారు.

సమస్య పరిష్కరించండి

ఖానాపురం హవేలీ పరిధిలో మా అమ్మ కాంతమ్మ పేరుతో 150

చదరపు గజాల ఇళ్ల స్థలాన్ని 1997లో కేటాయించారు. కానీ ఇప్పటి వరకు స్థలాన్ని స్వాధీనం చేయలేదు. సర్వేయర్‌ పరిశీలించినందున యంత్రాంగం స్థలాన్ని అప్పగించాలి.

– పేరం దాసయ్య, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, బీరోలు

ఈనెల 14నుంచి భారీ వర్షాలకు అవకాశం

కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

అంతా అప్రమత్తంగా ఉండండి..1
1/2

అంతా అప్రమత్తంగా ఉండండి..

అంతా అప్రమత్తంగా ఉండండి..2
2/2

అంతా అప్రమత్తంగా ఉండండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement