బడిబాట ప్రారంభం
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు సమీప గ్రామాలకు వెళ్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు విద్యార్థులకు కల్పించే సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్య, నోటుపుస్తకాలు, యూనిఫామ్ అందుతాయని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమాలకు ఉపాధ్యాయులతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ చైర్మన్లు కూడా హాజరవుతున్నారు.


