●ధైర్యంగా పంపించా...
కూసుమంచి: కూసుమంచి మండలం గోరీలపాడు తండాకు చెందిన బానోతు దస్మి ఇద్దరు కుమారులు భాస్కర్, ప్రసాద్ సైన్యంలో పని చేస్తున్నారు. భాస్కర్ కేరళలో, ప్రసాద్ చైన్నెలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల దస్మీకి ఆరోగ్యం బాగా లేకపోతే భాస్కర్ స్వస్థలానికి వచ్చాడు. ఇంతలో ఫోన్ రాగానే.. భాస్కర్ బయలుదేరాడు. ‘నాకు ఆరోగ్యం బాగా లేకున్నా.. దేశసేవ కోసం వెళ్లాల్సి రావడంతో భాస్కర్‌ను ధైర్యంగా పంపించా’ అని దస్మీ వెల్లడించింది. కొడుకు దేశం పోరాడుతుంటే, తండా వాళ్లంతా తనకు అండగా ఉన్నారని దస్మీ వెల్లడించింది.


