రంగస్థల నటుడు డీవీఎస్ మృతి
వైరా: వైరాకు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, ఊరేగింపు సినిమా నిర్మాతల్లో ఒకరైన దార్న వెంకటసత్యనారాయణ(77) మృతి చెందారు. అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తుండగా కన్నుమూశారు. వైరాలో జన్మించిన డీవీఎస్.నారాయణ ఏక్ దిన్‌కా సుల్తాన్ నాటకాన్ని 125సార్లు, తులసితీర్ధం నాటకాన్ని 50 సార్లు ప్రదర్శించారు. ఆతర్వాత పలు సినిమాల్లోనూ నటించిన ఆయన ఊరేగింపు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపై డాక్టర్ నాగబత్తిని రవి, షేక్‌సోందు సాహెబ్, దాసరాజు కుటుంబరా వు, కట్టా కృష్ణార్జునరావు, ఏడునూతల బుచ్చిరామారావు, నాగబత్తిని భాస్కరరావు, ఊరుకొండ వెంకటేశ్వరరావు, సంపసాల వరదరాజు, వెంకటేశ్వరరా వు, కృష్ణారావు, ప్రేమ్‌చంద్, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రామారా వు, గోవిందరావు, దార్న రాజశేఖర్, కట్ల రంగారావు, మేడా ప్రసాద్, నా యుడు సత్యనారాయణ, నూతి వెంకటస్వామి తదితరులు సంతాపం ప్రకటించారు.
పాతకక్షలతో దాడిలో యువకుడు మృతి
ఖమ్మంక్రైం: పాత కక్షల కారణంగా యువకుడిపై ఓ వ్యక్తి దాడి చేయటంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. ఘటన జరగాక మూడు రోజులకు విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం బాలాజీనగర్‌కు చెందిన షేక్ రెహమాన్(25) మద్యానికి బానిసై తిరుగుతూ సోదరి వద్ద ఉంటున్నాడు. డిసెంబర్ 28న రాత్రి బయటకు వెల్లిన ఆయన తిరిగి రాలేదు. రెహమాన్ కోసం గాలిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మార్చురీలో ఉందన్న సమాచారంతో బుధవారం చూడగా ఆయనదేనని గుర్తించారు. ఈమేరకు ఖమ్మం టూటౌన్ పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా విచారించడంతో 29వ తేదీ తెల్లవారుజామున బాలాజీనగర్ వద్ద నిద్రించిన రెహమాన్‌ను పాతకక్షలను మనస్సులో పెట్టుకుని లెనిన్‌నగర్ ప్రాంతానికి చెందిన షేక్ బాజీ దాడి చేసినట్లు తేలింది. తీవ్రంగా గాయపడిన రెహమాన్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందగా, వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఆయన సోదరి గుర్తించడంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.
బస్సు ఢీకొని
కండక్టర్ దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): బస్సును డ్రైవర్ వెనక్కి తీస్తుండగా సూచనలు చేస్తున్న కండక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇది. ఏపీలోని విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని వారధి సమీపాన బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం డిపో ఆర్‌టీసీ బస్సులో భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం గంగారానికి చెందిన వజ్జ అభిలాష్(40) కండక్టర్‌గా, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన తప్పిట ప్రకాశం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరు మంగళవారం భద్రాచలం నుంచి గుంటూరు వెళ్లి తిరిగి వస్తున్నారు. అయితే, మంగళవారం రాత్రి 10గంటల సమయాన బస్సు వారధి దాటాక వై.జంక్షన్ నుంచి బస్టాండ్ వైపునకు వెళ్లాల్సి ఉండగా 300 మీటర్లు ముందుకు వెళ్లింది. దీన్ని గమనించిన డ్రైవర్ రివర్స్ చేసే క్రమాన కండక్టర్ బస్సు దిగి వెనకకు వెళ్లి సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే, ప్రమాదవశాత్తు బస్సు కండక్టర్‌ను ఢీకొట్టి తలపైకి ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, అభిలాష్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చేసినట్లు విజయవాడ కృష్ణలంక పోలీసులు తెలిపారు.
మృతుడు టేకులపల్లి
మండల వాసి
రంగస్థల నటుడు డీవీఎస్ మృతి


