చిన్నపరెడ్డి సేవలు అభినందనీయం
ఖమ్మంగాంధీచౌక్: విధినిర్వహణలో కచ్చితత్వం, అంకితభావంతో పాటు సేవాగుణం కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషల్ అసోసియేట్ పుట్లూరి చిన్నపరెడ్డి సేవలు అభినందనీయమని పలువురు కొని యాడారు. చిన్నపరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఖమ్మంలోని ఎస్‌బీ ఐ మెయిన్ బ్రాంచ్‌లో బుధవారం ఆయనను సన్మానించాక అధికా రులు, యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. రెండు దశాబ్దాల పాటు సైన్యంలో పనిచేసిన ఆయన కార్గిల్ పోరులో పాల్గొన్నారని, ఆతర్వాత ఎస్‌బీఐ లో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరా డారని తెలిపారు. చిన్నపరెడ్డితో పాటు ఆయన సతీమణి విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్ ప్రశాంత్ లింగాల, రీజనల్ సెక్రటరీ రాంబాబు, ఉద్యోగులు పీవీఆర్‌కే.ప్రసాద్, పి.నరేష్, తిప్పైస్వామి, ఆశాజ్యోతి, కేఎస్.నందు, రేణుకుమార్, శ్రీ రష్మిత, పుట్లూరి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదతరులు పాల్గొన్నారు.
బ్యాడ్మింటన్ టోర్నీలో బంగారు పతకం
బోనకల్: మండలంలోని చిరునోములకు చెందిన చేపల మడుగు శశికళ అంతర్జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటింది. బిహార్‌లో ఇటీవల జరిగిన పోటీల్లో ఆమె బంగారు పతకం సాధించింది. ఇప్పటివరకు తొమ్మిది జాతీయస్థాయి టోర్నీల్లో పతకాలు సాధించిన శశికళను పలువురు అభినందించారు.
టేబుల్ టెన్నిస్ టోర్నీలో
ఖమ్మం స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన తమిళనాడులో జరిగిన అండర్–17 జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీలో ఖమ్మం క్రీడాకారులు కాంస్య పతకం దక్కించుకున్నారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న పరిటాల జ్వలిత్, గద్దల సిరి పతకాలు గెలుచుకోగా డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, టెబుల్ టెన్నిస్ అసో సియేషన్ జిల్లాఅధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్, వీవీఎస్.మూర్తి అభినందించారు.
చిన్నపరెడ్డి సేవలు అభినందనీయం
చిన్నపరెడ్డి సేవలు అభినందనీయం


