హైకోర్టు న్యాయమూర్తి మృతికి సంతాపం | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తి మృతికి సంతాపం

May 6 2025 12:40 AM | Updated on May 6 2025 12:40 AM

హైకోర

హైకోర్టు న్యాయమూర్తి మృతికి సంతాపం

ఖమ్మం లీగల్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎం.జీ.ప్రియదర్శిని మృతిపై ఖమ్మం బార్‌ అసోసియేషన్‌ బాధ్యులు సంతాపం ప్రకటించారు. ఈమేర కు సోమవారం బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో ఆమె చిత్రపటానికి నివా ళులర్పించాక అసోసియేషన్‌ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు, తదితరులు మాట్లాడారు. ప్రియదర్శిని మృతి న్యాయ రంగానికి తీరని లోటని, ఆమె ఖమ్మం జిల్లా కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. కాగా, జడ్జి మృతికి మృతికి సంతాపసూచకంగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈకార్యక్రమంలో విజయశాంత, ఇందిర, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, జడ్జి ప్రియదర్శిని మృతిపై న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రత్నాకరం శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డితో పాటు ఎస్‌.కే.నాగుల్‌ షరీఫ్‌, జిల్లా కోర్టు నాజర్‌ కె.శ్యామ్‌ తదితరులు కూడా సంతాపం తెలిపారు.

వడదెబ్బతో కార్మికుడు మృతి

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం కై కొండాయిగూడెంకు చెందిన బోల్లపు శ్రీనివాసరెడ్డి(47) వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందారు. బల్లెపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో రోజువారీ కూలిగా పనిచేస్తున్న ఆయన ఎండవేడితో ఇటీవల అపస్మారక స్థితికి చేరాడు. దీంతో సహచర కార్మికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, సోమవారం ఉదయం మృతి చెందాడు. ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారు. కాగా, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకుడు దొంగల తిరుపతిరావు డిమాండ్‌ చేశారు.

రైలు ఢీకొని వృద్ధురాలు..

బోనకల్‌: మండలంలోని గోవిందాపురం(ఏ) గ్రామానికి చెందిన షేక్‌ నన్నేబీ(75) రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందింది. ఆమె సోమవారం గ్రామంలోని ట్రాక్‌ దాటే సమయాన వేగంగా వస్తున్న రైలును గమనించలేదు. దీంతో రైలు ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందింది. నన్నేబీ మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

బోనకల్‌: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మండలంలోని గార్లపాడు వద్ద సీజ్‌ చేసినట్లుగా ఎస్‌ఐ పొదిలి వెంకన్న తెలిపారు. బ్రాహ్మణపల్లి, మోటమర్రి గ్రామాల్లోని ఇసుక ర్యాంప్‌ల నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను తనిఖీ చేయగా రెండింటికి అనుమతి లేదని తేలినట్లు చెప్పారు. ఈమేరకు వాహనాలను సీజ్‌ చేసి యజమానులైన మల్లెల వీరభద్రం, గోపిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

వేంసూరు: మండలంలోని కుంచపర్తిలో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.9,500 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

షార్ట్‌సర్క్యూట్‌తో ఫొటోస్టూడియో దగ్ధం

కారేపల్లి: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కారేపల్లిలోని ఓ ఫొటోస్టూడియో దగ్ధమైంది. కారేపల్లి బస్టాండ్‌ సెంటర్‌లోని డాక్టర్‌ రాఘవులు కాంప్లెక్స్‌లో సూర్యతండాకు చెందిన ధరావత్‌ రాంచంద్‌ స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి స్టూడియో నుంచి పొగలు వస్తుండడంతో పెట్రోలింగ్‌ కానిస్టేబుల్‌ సీతారాములు గమనించి ఫైర్‌ స్టేషన్‌తో పాటు నిర్వాహకుడికి ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. కాగా, మంటలు ఎగిసిపడుతుండడంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇంతలోనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో స్టూడియోలోని కెమెరాలు, జిరాక్స్‌ మిషన్‌, కంప్యూటర్లు పాటు పరీచర్‌కాలిపోవడంతో సుమారు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు రాంచంద్‌ వెల్లడించాడు. ఆర్‌ఐ నర్సింహారావు సోమవారంఉదయం పంచనామా చేయగా, ఘటనపై బాధితుడు రాంచంద్‌ కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైకోర్టు న్యాయమూర్తి మృతికి సంతాపం1
1/1

హైకోర్టు న్యాయమూర్తి మృతికి సంతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement