ఫిర్యాదులు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ దరఖాస్తును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆమె డీఆర్‌డీఓ సన్యాస్యతో కలిసి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై డీఆర్వో.. దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విధుల్లో చేరిన
ఆర్‌టీఓ వెంకటరమణ
ఖమ్మంక్రైం: కొంతకాలంగా సెలవులో ఉన్న ఖమ్మం ఎంవీఐ, ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ వెంకటరమణ సోమవారం విధుల్లో చేరారు. ఇంతకాలం వైరా ఎంవీఐ వరప్రసాద్ ఇన్‌చార్జ్ ఆర్‌టీఓగా వ్యవహరించారు. ఈ మేరకు విధుల్లో చేరిన అనంతరం వెంకటరమణ రవాణాశాఖ ఉద్యోగులతో సమావేశమై త్రైమాసిక పన్నుల వసూళ్లు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలపై సూచనలు చేశారు.
అభివృద్ధి పనులు పరిశీలించిన డీఆర్‌ఎం
మధిర: మధిర రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం భర్తేష్ కుమార్ జైన్ సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా పనుల్లో వేగం పెంచడమే కాక నాణ్యతగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కాగా, అఖిలపక్షం నాయకులు సూరంశెట్టి కిషోర్, మందా సైదులు, బెజవాడ రవిబాబు తదితరులు డీఆర్‌ఎంను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మధిరలో రైల్వే అండర్ పాస్ నిర్మించాలని, అప్పటివరకు రైల్వేగేట్ వద్ద రాకపోకలకు అనుమతించడమే కాక గౌతమి, సింహపురి, నవజీవన్ రైళ్ల హాల్టింగ్ ఇప్పించాలని కోరారు.
వచ్చేనెలలో
ఉపాధ్యాయులకు శిక్షణ?
ఖమ్మం సహకారనగర్: ఇటీవల చేపట్టిన వివిధ సర్వేల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కొందరు పలు అంశాల్లో వెనుకబడినట్లుగా తేలింది. ఈనేపథ్యాన సబ్జెక్టు ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంచేందుకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా 30వ తేదీలోగా రిసోర్స్‌పర్సన్ల ఎంపిక పూర్తి చేశాక.. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్‌సీఈఆర్‌టీ)లో శిక్షణ ఇస్తారని సమాచారం. ఆపై వీరి ద్వారా మే నెలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
మార్కెట్ల ద్వారా లక్ష్యానికి మించి ఆదాయం
ఏన్కూరు: వరంగల్ రీజియన్ పరిధి వ్యవసాయ మార్కెట్ల ద్వారా లక్ష్యానికి మించి ఆదాయం వస్తోందని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి తెలిపారు. ఏన్కూరులోని వ్యవసాయ మార్కెట్‌ను సోమవారం తనిఖీ చేసిన ఆమె మిర్చి కొనుగోళ్లు, జెండా పాట, నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం డీడీ మాట్లాడుతూ గత ఏడాది మార్కెట్ల ద్వారా రూ.449 కోట్ల లక్ష్యానికి గాను రూ.458 కోట్ల ఆదాయం నమోదైందని తెలిపారు. మార్కెట్లతో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక పంటలకు మద్దతు ధర లభించేలా ఉద్యోగులు పర్యవేక్షించాలని సూచించారు. మార్కెట్ కార్యదర్శి బజార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు పరిష్కరించండి
ఫిర్యాదులు పరిష్కరించండి


