
ఉపయోగపడకపోతే ఇచ్చేద్దాం...
● కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ● జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి వద్ద ‘వాల్ ఆఫ్ కై ండ్‌నెస్’ ప్రారంభం
ఖమ్మంమయూరిసెంటర్: ఇంట్లో మనకు పనికి రానివి ఇతరులకు ఉపయోగపడే అవకాశమున్నందున వాటిని ఇవ్వడానికి ముందుకు రావాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి ఎదురుగా ‘వాల్ ఆఫ్ కై ండ్ నెస్’ పేరిట ఏర్పాటుచేసిన గోడను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇళ్లలో ఉపయోగపడని దుస్తులు, ఇతర సామగ్రిని ఇక్కడ వదిలేస్తే అవసరమైన వారు తీసుకెళ్తారని చెప్పారు. కాగా, సామగ్రిని శుభ్రం చేసి నిర్దేశిత షెల్ప్‌లో వేస్తే అవసరమైన వారికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల్లో ప్రవేశాలు పెరగాలి
ఖమ్మంఅర్బన్: అంగన్‌వాడీలకు చిన్నారులు ఆసక్తిగా వచ్చే అవకాశమున్నందున ప్రవేశాలు పెరిగేలా ప్రయత్నించాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మంలోని యూపీహెచ్ కాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని రూ.10లక్షలు వెచ్చించి బొమ్మలు, ఇతర ఏర్పాట్లతో ఆధునికీకరించగా అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్టతో కలిసి ప్రారంభించారు. ఇండస్ట్రియల్ ఏరియా, యూపీహెచ్ కాలనీ అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్న భవనాల్లో చిన్నారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం బాగుందన్నారు. డీడబ్ల్యూఓ రాంగోపాల్‌రెడ్డి, సీడీపీఓ వీరభద్రమ్మ, ఉద్యోగులు నాగమణి, సునీత, మస్తాన్, సుమతి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాటుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించిన ఆయన జిల్లాలో 2.58లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉందన్నారు. ఇందులో 1.85వేల మెట్రిక్ టన్నుల సన్నరకం, 73వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ఉండనున్నందున 344 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆపై ఆన్‌లైన్‌లో నమోదు, రవాణా, చెల్లింపులపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్, డీఎం శ్రీలత, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఏఓ డి.పుల్లయ్య, డీఎంఓ ఎం.ఏ.అలీం, డీసీఓ గంగాధర్ పాల్గొన్నారు.
స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధించాలి
పెనుబల్లి: మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. పెనుబల్లి ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ సిబ్బంది, వీఏఓలు, సీసీలతో సమావేశమైన ఆయన డ్వాక్రా గ్రూపుల పని తీరు, మహిళా శక్తి ద్వారా సీ్త్ర క్యాంటీన్ల ఏర్పాటుపై ఆరా తీశారు. మహిళా సంఘాల సభ్యులకు అండగా నిలిచేలా బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పిస్తామని, తద్వారా కొత్త పథకాలు ప్రారంభించుకోవాలని సూచించారు. అలాగే, బాలికలకు తప్పనిసరి చదువు చెప్పించాలని సూచించిన కలెక్టర్... ఏళ్ల క్రితమే చదువుకున్న తన అమ్మమ్మ తనకు ప్రేరణగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తహసీల్దార్ గంటా ప్రతాప్, ఎంపీడీఓ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.