ఖమ్మం సహకారనగర్: దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు వేచిచూస్తున్న సీపీఎస్ రద్దు, డీఏలు, సర్వీస్ రూల్స్ తదితర సమస్యల పరిష్కారానికి మండలితో తన గళం వినిపిస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికై న పింగిళి శ్రీపాల్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మం – వరంగల్ – నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికై న ఆయన తొలిసారి సోమవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ నాయకులు 500ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మంలోని యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన విజయోత్సవ సభలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు, కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ మంజూరు తదితర అంశాల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. ఈకార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యలమద్ది వెంకటేశ్వర్లు, రామిశెట్టి రంగారావుతో పాటు మోత్కూరు మధు, సతీష్‌తో పాటు పలువురు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజయోత్సవ సభలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి


