ఒకరోజు ఆదాయం రూ.21, 945
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 339 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.11,625, 250 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.10, 320 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో
ప్రవేశాలకు టెస్ట్‌లు
గుండాల: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను మోడల్ స్పోర్ట్స్ పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు కాచనపల్లిలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిన్నెరసాని, కాచనపల్లి, బోయినపల్లి మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలో ప్రవేశాల కోసం సోమవారం కాచనపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారని, అవకాశాన్ని నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, తీసుకురావాలని, టీషర్టుతో హాజరు కావాలని పేర్కొన్నారు.