భద్రాచలంటౌన్: గిరిజన యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఆసక్తి గల గిరిజన నిరుద్యోగులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈనెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు 94928 06325, 98485 22841 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని, లేదా తమ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ సంప్రదించవచ్చని తెలిపారు.
జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వార్యాన ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–16, 20, సీనియర్ పురుషుల, మహిళల విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా జట్టుకు ఎంపికై న వారిని ప్రకటించారు. అండర్–16 బాలుర జట్టులో వి.చరణ్‌గౌడ్(కొణిజర్ల), ఆర్. భరత్(పాతర్లపాడు), అండర్–20 బాలుర విభాగంలో ఎ.గౌతమ్(వైరా), డి.వివేక్‌చంద్ర(పాలేరు), ఎస్.గోపి(ఖమ్మం), బి.వీరభద్రం(ఖమ్మం), పురుషుల విభాగంలో వి.వేణు, ఎం.మురళి(కుంచపర్తి), అండర్–20 బాలికల విభాగంలో డి.బిందు (ఖమ్మం), జె.నవ్య(వల్లాపురం), మహిళల్లో ఎ.మైథీలి(ఖమ్మం) ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మందుల వెంకటేశ్వర్లు, కోచ్ ఎండీ. గౌస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన ‘స్వేచ్ఛ’
ఖమ్మంగాంధీచౌక్: నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘స్వేచ్ఛ’ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. పరమాత్మ శివరాం రచించిన ఈ నాటికకు బీఎం రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో సాంస్కృతిక రంగం పాత్ర విశేష మైందన్నారు. మిత్ర గ్రూపు చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, ఎంఏ జబ్బార్ తదితరులు మాట్లాడుతూ నెల నెలా వెన్నెల కార్యక్రమాలను కొనియాడారు. ఆర్క్స్ సంస్థ కార్యదర్శి ఏఎస్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షుడు నాగబత్తిని రవి, ప్రజానాట్యమండలి అధ్యక్ష, కార్యదర్శులు నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వం..
రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
‘రాజీవ్ యువ వికాసానికి’ దరఖాస్తుల ఆహ్వానం
‘రాజీవ్ యువ వికాసానికి’ దరఖాస్తుల ఆహ్వానం
‘రాజీవ్ యువ వికాసానికి’ దరఖాస్తుల ఆహ్వానం