సత్తుపల్లి/సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని ఓసీల నుంచి బొగ్గు రవాణాకు ఏర్పాటుచేసిన సైలోబంకర్ ద్వారా స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యాన స్పందించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. ఈమేరకు హైదరాబాద్‌లో సింగరేణి సీఎండీ బలరాంను శనివారం కలిసిన ఆమె సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు, కిష్టారం వాసుల దీక్షలపై వివరించారు. కాలుష్య ప్రభావంతో పలువురు మృతి చెందగా, బాంబ్ పేలుళ్లులో ఇళ్లు దెబ్బతిన్నందున బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య వినతితో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సింగరేణి ఓసీలు, సైలోబంకర్ ద్వారా ఎదురవుతున్న సమస్యలను శనివారం శాసన మండలిలో ప్రస్తావించారు.
సింగరేణి సీఎండీని కలిసిన ఎమ్మెల్యే