తల్లాడ: మండలంలోని లక్ష్మీనగర్ గ్రామ సమీపాన భారీ వృక్షం మొదట్లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా అది కాలిపోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో 33 కేవీ లైన్ తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి భారీ వృక్షం మొదట్లో నిప్పు పెట్టగా కాలుతూ పెద్ద కొమ్మ విరిగి పక్కనే ఉన్న స్తంభంపై పడినట్లు తెలుస్తోంది. ఈక్రమాన మరో రెండు స్తంభాలు కూడా ఒరిగిపోయాయి. ఈమేరకు వైరా అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పగా, విద్యుత్ శాఖాదికారులు మరో లైన్ నుంచి సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్ ఏఈ రాయల ప్రసాద్ మాట్లాడుతూ చెట్లు, పొలాల్లో నిప్పు పెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని గుర్తించాలని తెలిపారు.
విద్యుత్ స్తంభంపై పడడంతో సరఫరాకు
అంతరాయం