
ఆలయానికి సమర్పించిన నారికేళ కళాకృతులు, (ఇన్‌సెట్) రాధారాణి
సమర్పించిన హైదరాబాద్ వాసి రాధారాణి
ముదిగొండ: ముదిగొండ మండలం ముత్తారంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణానికి హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు వి.రాధారాణి ప్రత్యేక నారికేళ కళాకృతులను రూపొందించారు. వీటిని ఆమె ఆలయ అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులకు సోమవారం అందజేశారు. ఈ కళాకృతులను రూపొందించేందుకు నెల పాటు నుంచి రాత్రింబవళ్లు శ్రమించగా.. చాన్నాళ్లు నిల్వ ఉండే కేరళ బొండాలపై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పూసలు, ముత్యాలతో సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. స్వామివారి పాదసేవలో భాగంగా వీటిని తయారు చేయగా, రాధారాణిని ఆలయ కమిటీ బాధ్యులు తుళ్లూరు జీవన్, కాకి వీరభ ద్రం, వి. వెంకటేశ్వరరావు, ఆలయ శాశ్వత ధర్మకర్త వి.వెంకటనాగేశ్వరావు అభినందించారు.
