సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా ఆదివా రం నిర్వహించనున్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలకు యాజమాన్యం రూ.12.10 లక్షల బడ్జెట్ కేటాయించింది. ఇందులో ఎస్టీపీపీ(సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంట్, మంచిర్యాల)కు రూ.50 వేలు, హైదరాబాద్ కార్యాలయానికి రూ.35 వేలు, నైనీ కార్యాలయానికి రూ.25 వేలతో పాటు మిగిలిన 11 ఏరియాలకు రూ.లక్ష చొప్పున నిధులు విడుదల చేశారు. ఈమేరకు వేడుకలను ఘనంగా నిర్వహించాలని జీఎం పర్సనల్(వెల్ఫేర్ అండ్ ఆర్సీ) కట్టా బసవయ్య సూచించారు. ఇటీవల ఆయన వివిధ విభాగాల అధికారులు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో సమావేశమై చర్చించారు.
కాగా, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధా న కార్యాలయంలో ఆదివారం డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యాన అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.