తండ్రి మరణాన్ని దిగమింగుకుని.. | - | Sakshi
Sakshi News home page

తండ్రి మరణాన్ని దిగమింగుకుని..

Mar 19 2024 12:30 AM | Updated on Mar 19 2024 9:43 AM

- - Sakshi

ఎస్సెస్సీ పరీక్షకు హాజరైన విద్యార్థి

ఖమ్మం: అనారోగ్యంతో తండ్రి మరణించగా, అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే.. ఆ బాధను దిగమింగుకుని ఎస్సెస్సీ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అవని వెంచర్‌లో నివాసముంటున్న వై.ముత్యాలరావు అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందగా ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ముత్యాలరావు ఏకై క కుమారుడు, ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎస్సెస్సీ చదువుతున్న మౌళిరాజ్‌ తలకొరివి పెట్టాడు.

అయితే, సోమవారం నుంచి పదో తరగతి వార్షిక ప్రారంభం కావడంతో బంధువులు, కుటుంబీకుల సూచన మేరకు ఆయన దుఃఃఖాన్ని భరిస్తూనే సత్తుపల్లిలోని ఎన్టీఆర్‌నగర్‌లోని పరీక్షా కేంద్రానికి హాజరై తెలుగు పరీక్ష రాశాడు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, స్నేహితులు సైతం ఆయనకు మనోధైర్యాన్నిచ్చారు.

ఇవి చదవండి: 13 ఏళ్లుగా '108 అంబులెన్స్‌' రూపంలో.. వెంటాడిన మృత్యువు!

Advertisement
 
Advertisement
Advertisement