● లబ్ధిదారుల నుంచి డబ్బు వసూళ్లు ● వార్డ్ ఆఫీసర్ సస్పెన్షన్, విచారణకు ఆదేశం
సాధారణ
వర్షపాతం
రెండు నెలల్లో
వర్షపాతం లోటు
వరి సాగు (అంచనా)
ఇప్పటి వరకు సాగు
తీవ్ర లోటు వర్షపాతం
లోటు
వర్షపాతం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలకసంస్థ(కేఎంసీ) పరిధిలో కొందరు ఉద్యోగులు అక్రమాల రెక్కలు విప్పుతున్నారు. సొంతింటి కల నెరవేర్చుకుందామనుకునే పేదల ఆశలే ఆసరాగా వారు జేబులు నింపుకుంటున్నారు. కేఎంసీ పరిధిలోని పలు విభాగాల్లో ఇప్పటికే అవినీతి వెలుగు చూడగా.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నగదు వసూలు చేసిన ఓ వార్డ్ ఆఫీసర్ బాగోతం బయటపడింది.
ఫిర్యాదుతో వెలుగులోకి..
ఖమ్మం 57వ డివిజన్‌కు చెందిన ఓ ఇందిరమ్మ లబ్ధిదారుడి నుంచి వార్డ్ ఆఫీసర్ సందీప్ డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు గతనెల 30న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో ఈనెల 1న కలెక్టర్, అదనపు కలెక్టర్‌ను ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు సోమవారం సందీప్‌ను సస్పెండ్ చేయడమే కాక అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ కోసం హౌసింగ్ ఈఈ, కేఎంసీ మేనేజర్, మరో అధికారితో కూడిన త్రీమెన్ కమిటీని నియమించినట్లు సమాచారం.
ఆది నుంచీ అదే దందా..
కేఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమైన నాటి నుంచే సిబ్బంది లంచాల వసూలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ మహిళా వార్డ్ ఆఫీసర్ లబ్ధిదారుడి నుంచి డబ్బు తీసుకోగా, విషయం బయటకు రావడంతో తిరిగి ఇచ్చినట్లు సమాచారం. అంతేకాక హౌసింగ్ ఏఈలు బిల్లులు మంజూరు చేయాలంటే పర్సంటేజీ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వార్డ్ ఆఫీసర్లు, హౌసింగ్ ఏఈలు కుమ్మకై ్క పేదల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇంటి మంజూరు, బిల్లుల కోసం లబ్ధిదారులు నిత్యం కేఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కేఎంసీతో పాటు కలెక్టరేట్ వేదికగా జరిగే ప్రజావాణిలో వినతులు ఇస్తూనే, సిబ్బంది అక్రమాలపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా వార్డ్ ఆఫీసర్ సందీప్‌పై చర్యలు తీసుకోవడంతో, ఇంకొందరు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బాధితులు నోరు విప్పితే తమ ఉద్యోగానికి ఎసరు వస్తుందని కేఎంసీలోని పలువురు వార్డు ఆఫీసర్లు, అధికారుల్లో భయం పట్టుకుందని సమాచారం.


