
ఘంటసాల చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న గాయకులు, నిర్వాహకులు
ఖమ్మంగాంధీచౌక్: అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఖమ్మం స్వర మాధురి కల్చరల్ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. ఘంటసాల చిత్ర పటానికి కల్చరల్ యూనిట్ ప్రతినిధులు, అతిథులు నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన మధుర గీతాలను గాయనీ గాయకులు సుధారాణి(విజయవాడ), వి.మాలతి నాయుడు(ఖమ్మం), జి శకుంతల నవీన్, వీవీ రెడ్డి, ఆదిరాజు పురుషోత్తం, ఇజ్రాయిల్, పున్నయ్య, ప్రకాష్, ఇమామ్ తదితరులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్‌లాల్ హాజరు కాగా, నెల నెలా వెన్నెల ప్రధాన కార్యదర్శి ఏఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.