
రికార్డులు తనిఖీ చేస్తున్న వ్యయ పరిశీలకులు రాజీవ్‌కుమార్‌సింగ్
కల్లూరు రూరల్: కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ దంతాల సుధాకర్ క్రికెట్ వరల్డ్‌కప్ 2023 నమూనాను ఆకర్షణీయంగా తయారుచేశాడు. ప్రస్తుతం జరిగే వరల్డ్‌కప్‌లో భారతజట్టు గెలవాలనే ఆకాంక్షతో థర్మకోల్‌తో కప్పును తీర్చిదిద్దానని ఆయన తెలిపారు. గత వరల్డ్ కప్ సమయాన క్యారెట్, పుచ్చకాయతో నమూనా కప్ రూపొందించానని వెల్లడించారు.
నేడు కేవీకేలో కిసాన్ మేళా
వైరా: వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన మంగళవారం కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డి నేటర్ డాక్టర్ ఏ.శైలజ తెలిపారు. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తున్న రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో వేయాల్సిన పంటలపై ఈ మేళాలో రైతులకు సలహాలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే, సాంకేతిక విధానాలపై స్టాళ్ల ద్వారా అవగాహన కల్పిస్తామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకుల ఆరా
సత్తుపల్లి: కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన జనరల్ అబ్జర్వర్ సత్యేంద్రసింగ్ సోమవారం సత్తుపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం, స్ట్రాంగ్‌రూంలను సందర్శించిన ఆయన పోలీస్ స్టేషన్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లపై సూచనలు చేయడంతో పాటు పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రశాంత వాతావరణం నెలకొనేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారి అశోక్‌చక్రవర్తి, ఏసీపీ రామానుజం, సీఐలు మోహన్‌బాబు, హనూక్ పాల్గొన్నారు.
పక్కాగా లెక్కతేల్చండి..
సత్తుపల్లిటౌన్: అభ్యర్థుల వ్యయాన్ని పక్కాగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజీవ్‌కుమార్‌సింగ్ సూచించారు. సత్తుపల్లిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో పాటు మేడిశెట్టివారిపాలెంలోని చెక్‌పోస్టులో రికార్డులు తనిఖీ చేసిన ఆయన అన్ని వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని తెలిపారు. ఆయన వెంట అధికారులు ఏ.నాగేశ్వరరావు, కిషోర్ పాల్గొన్నారు.

వరల్డ్‌కప్ నమూనాతో సుధాకర్