జూనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఒక్కసారిగా ఇలా అవ్వడంతో.. | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఒక్కసారిగా ఇలా అవ్వడంతో..

Oct 20 2023 12:08 AM | Updated on Oct 20 2023 1:29 PM

- - Sakshi

డాక్టర్‌ సుమ (ఫైల్‌)

ఖమ్మం: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన జూనియర్‌ డాక్టర్‌ సుమ (23) డెంగీ జ్వరంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. సుమ హైదరబాద్‌లో ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో జూనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా మారి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహాన్ని హైదరబాద్‌ నుంచి సీతానగరం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సుమ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చదవండి: దయచేసి.. మా కుమారుడిని కాపాడండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement