నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Nov 8 2026 12:25 AM | Updated on Nov 8 2026 12:25 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకునేందుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా మూడుగ్రామాల్లోని లబ్ధిదారుల ఇళ్లలో వేడుకలకు మంత్రి హాజరవుతారు. ఉదయం 8–30 గంటలకు ఖమ్మం రూరల్‌ మండలం కామంచికల్‌, 9–30 గంటలకు నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం, 10–30 గంటలకు కూసుమంచి మండలం పాలేరులో జరిగే వేడుకల్లో మంత్రి పాల్గొంటారని క్యాంప్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి తెలిపారు.

శ్రీవారికి అభిషేకం,

నిత్యకల్యాణం

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భగుడిలోని మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి అర్చకులు తెల్లవారుజామున పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థుల్లో డిజిటల్‌

అక్షరాస్యత పెంచాలి

● గణిత ఉపాధ్యాయుల శిక్షణలో

డీఈఓ వాసంతి

ఖమ్మంసహకారనగర్‌: గేమింగ్‌ కృత్యాల ద్వారా విద్యార్థుల్లో డిజిటల్‌ అక్షరాస్యతను పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘ఏ బుక్‌ ఆన్‌ డిజిటల్‌ లెర్నింగ్‌’, ఖాన్‌ అకాడమీ డిజిటల్‌ కార్యక్రమాలపై గణిత ఉపాధ్యాయులకు ఖమ్మంలో మూడు రోజులుగా ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ సమావేశంలో డీఈఓ వాసంతి మాట్లాడుతూ గేమింగ్‌ కృత్యాలకు కృత్రిమ మేథస్సు, డిజిటల్‌ సాంకేతికతను జోడించి వినూత్న బోధనా పద్ధతులను రూపొందించి, అమలుచేయాలని తెలిపారు. ఇంటరాక్టివ్‌ ప్యానెల్‌ బోర్డులు, కంప్యూటర్ల ఆధారంగా ఖాన్‌ అకాడమీలో విద్యార్థుల నమోదు, వినియోగ శాతాన్ని పెంచాలని చెప్పారు. అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి మాట్లాడగా కేంద్రం ఇన్‌చార్జి రమేష్‌, రిసోర్స్‌ పర్సన్లు మహేష్‌, కిషోర్‌, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌హెచ్‌ఎం పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

ఖమ్మం వైద్యవిభాగం: ఎన్‌హెచ్‌ఎం పరిధిలో కాంట్రాక్ట్‌ పద్ధతిపై పోస్టులు భర్తీ చేయనుండగా, ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. మెరిట్‌ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఈ నెల 9, 10వ తేదీల్లో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందజేయాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.

డీవీఆర్‌ రెగ్యులేటరీకి రూ.2.7 కోట్లతో

ప్రతిపాదనలు

నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం చెరువును జల వనరుల శాఖ సీఈ వాసంతి శనివారం పరిశీలించారు. చెరువు నీటి సామర్ధ్యం, నిల్వలపై ఆరా తీశారు. అలాగే, చెరువు వద్ద దేవినేని వెంకటరమణ కెనాల్‌(డీవీఆర్‌) కెనాల్‌ రెగ్యులేటరీ శిథిలావస్థకు చేరి నీరు వృథాగా పోతుండడంతో పరిశీలించారు. అనంతరం సీఈ మాట్లాడుతూ నూతనంగా రెగ్యులేటరీ నిర్మాణంతో పాటు కాల్వ పటిష్టత పనులకు రూ.2.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. కాగా, మంగాపురం తండాలో మేజర్‌ కాల్వపై బ్రిడ్జి శిథిలావస్థకు చేరినందున కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ ధీరావత్‌ అశోకరాణి, ధీరావత్‌ రాధాకృష్ణమూర్తి కోరగా సీఈ బ్రిడ్జిని పరిశీలించారు. ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈఈలు పొట్టయ్య, కె.దీక్షత, ఏఈ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement