ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ

Nov 8 2026 12:25 AM | Updated on Nov 8 2026 12:25 AM

● రెండో స్థానాన నిలిచిన కొత్తగూడెం యూసీఈఈ

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా జూనియర్‌ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌–19 కరాటే పోటీలు శనివారం ముగిశాయి. పోటీల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందించగా, పలువురిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు. జిల్లా క్రీడాల సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం, టోర్నీ ఆర్గనైజర్‌ గోపతి సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 14నుంచి రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ జూడో టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా జూడో అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఈనెల 14, 15వ తేదీల్లో రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అసోసియేషన్‌ కార్యదర్శి బైరబోయిన కై లాస్‌ యాదవ్‌ తెలిపారు. ఖమ్మంలో శనివారం ఆయన మాట్లాడుతూ..ఖమ్మం రూరల్‌ మండలం కామంచికల్‌లోని తిరుమలమ్మ ఫంక్షన్‌ హాల్‌లో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి 400 మంది బాలబాలికలతో పాటు కోచ్‌లు, మేనేజర్లు హాజరవుతారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని డిసెంబర్‌ 11నుంచి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జూడో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లెల్ల శ్రీనివాసరావుతో పాటు ప్రతినిధులు పి.రామయ్య, దుపాకి సంతోష్‌కుమార్‌, బానోత్‌ రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్‌ టోర్నీ విజేత

‘ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌’

ఖమ్మం: రెండు రోజులుగా ఖమ్మంలో జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మం జోన్‌ డిగ్రీ కళాశాలల క్రికెట్‌ పోటీలు శనివారం ముగిశాయి. ఈమేరకు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ – కొత్తగూడెం యూసీఈఈ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్‌ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 91 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. అనంతరం యూసీఈఈ జట్టు చివరి వరకు పోరాడినా 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఖమ్మం జోన్‌ క్రీడా కార్యదర్శి డాక్టర్‌ బి.వెంకన్న ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీలు డాక్టర్‌ కోటయ్య, గోపీకష్ణ, జె.ఉపేందర్‌, ఎం.డీ.మతిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement