తమ్మినేని సార్ .. పాలేరు నుంచి పోటీ చేయండి.. | - | Sakshi
Sakshi News home page

తమ్మినేని సార్ .. పాలేరు నుంచి పోటీ చేయండి..

May 6 2023 12:04 AM | Updated on May 6 2023 11:35 AM

- - Sakshi

ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పలువురు యువకులు కోరారు. ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలోని తమ్మినేని నివాసంలో శుక్రవారం గువ్వలగూడెంకు యువకులు ఆయనను కలిసి సీపీఎంలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు చట్టసభల్లో లేకపోవటంతో ప్రజల సమస్యలపై ప్రస్తావన రావడం లేదని తెలిపారు. ఈమేరకు వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేయాలని ఆయనను కోరారు. నాయకులు మారుతి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement