మండ్య: పుష్కరిణిలో మధ్యాహ్నం తీర్థస్నానం, రాత్రి పడిమాలె, యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించడంతో ప్రముఖ శ్రీవైష్ణవ క్షేత్రం మేలుకోటె చెలువనారాయణస్వామి దేవస్థానంలో రాజముడి బ్రహ్మోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది. మధ్యాహ్నం వేదఘోష మధ్య కళ్యాణిలో స్నపనశెల్వరికి అభిషేకం నిర్వహించారు. స్వామివారితోపాటు అర్చకులు, స్థానికులు, పరిచారకులు, భక్తులు పుష్కరిణిలో మునిగి పవిత్ర స్నానం ఆచరించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు సంధానసేవ జరిగిన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు కళ్యాణిలో తీర్థస్నానం మహోత్సవం ఆచరించారు. రాత్రి దేవాలయంలో పడిమాలె చేపట్టారు. బ్రహోత్సవంలో సంప్రదాయం ప్రకారం మాలమర్యాద నిర్వహించారు. కాగా, 24న మంగళవారం విష్ణు దీపోత్సవం జరుగుతుంది.
పుష్కరిణిలో పవిత్ర స్నానం


