సాక్షి బెంగళూరు: కెనరా బ్యాంకులో బ్యాంకింగ్ కంటే కూడా ఆరోగ్యకర, బలమైన, అధిక కనెక్టివిటీ కలిగిన ఒక సముదాయాన్ని సృష్టించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎండీ, సీఈవో బ్రజేశ్ కుమార్ సింగ్ తెలిపారు, ఈ మారథాన్‌లో ఎయిమ్స్ సర్టిఫికేషన్ అనేది తాము సాధించిన ఒక గొప్ప మైలురాయి అని తెలిపారు. కెనరా బ్యాంకు మారథాన్ నాల్గో ఎడిషన్‌ను బెంగళూరులో ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో వేలాది మందితో సాగింది. ఆరోగ్యకరమైన జీవితశైలీ, సామాజిక భాగస్వామ్యం, దృఢమైన శారీరక సామార్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో శ్రీకమ్ టు గెదర్.. రన్ టుగెదర్‌శ్రీ అనే థీమ్ మీద ఈ మారథాన్‌ను చేపట్టారు. బ్రజేశ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.
11 వేల మంది హాజరు
ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత ఎంఆర్ పూవమ్మ 4 ఇన్‌టు 400 రిలేలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 3కే, 5కే, 10కే అనే మూడు కేటగిరీల్లో ఈ మారథాన్ జరిగింది. ఇందులో సుమారు 11,286 మంది వివిధ వయసుల వారు పాల్గొని తమ క్రీడాస్ఫూర్తిని చాటారు. 10కేలో పురుష, మహిళ విజేతలు అయిన వారికి రూ. 2 లక్షల క్యాష్ ప్రైజ్‌ను , అలాగే 5కే విజేతలకు రూ. లక్ష, 3కే వీజేతలకు రూ. 50 వేల బహుమానాన్ని అందించారు.


