నమో నీలకంఠ.. దేవదేవ | - | Sakshi
Sakshi News home page

నమో నీలకంఠ.. దేవదేవ

Nov 17 2026 1:26 AM | Updated on Nov 17 2026 1:26 AM

బొమ్మనహళ్లి: పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆలయాలలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది. మొదటి కార్తీక సోమవారం కావడంతో బెంగళూరు బొమ్మనహళ్ళిలోని శివాలయాలకు భక్తజనం తరలివచ్చారు. మంగమ్మనపాళ్య శ్రీకాశీ విశ్వనాథస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు శివలింగానికి పాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం చేసి దీపారాధన గావించారు.

వైద్యనాథపురంలో..

మండ్య: జిల్లాలో ఆలయాలలో విశేషంగా కార్తీక సోమవారం పూజలు జరిగాయి. నగరంలోని శ్రీఅరకేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి అభిషేక పూజలు ప్రారంభమయ్యాయి. చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. వైద్యనాథపురంలోని శ్రీవైద్యనాథేశ్వర ఆలయంలో స్వామివారికి, ప్రసన్న పర్వతాంభ దేవికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. ఇక్కడి శింషా నదిలో గంగమ్మ పూజలు చేశారు. చర్మ వ్యాధులతో బాధపడేవారు మంత్రించిన మట్టిని పూసుకుని స్నానం చేసి, దేవునికి ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. పెళ్లికాని యువతీ యువకులు మనోవాంఛ నెరవేరాలని అర్చించారు.

శివాలయాల్లో కార్తీక సోమవార పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement