బనశంకరి: బెంగళూరు కుమారకృప అతిథిగృహం ఇకపై ముఖ్యమంత్రి అధికార నివాసంగా మారనుంది. ఈ భవనానికి పాత పేరు తీసేసి గంగ అని పేరుపెట్టారు. గంగలో సీఎం డీకే.శివకుమార్ దంపతులు సోమవారం పూజ నిర్వహించి గృహ ప్రవేశం చేశారు. అతిథి గృహం ప్రధాన కట్టడం, అనెక్స్ భవనాన్ని అధికార నివాసంగా తీర్చిదిద్దారు. కట్టడ చరిత్రకు భంగం కలగకుండా మార్చామని సీఎం తెలిపారు. కార్తీక సోమవారం సందర్భంగా నోణవినకెరె అజ్జయ్య నేతృత్వంలో పూజలు, హోమాలు నిర్వహించారు. గురువారం అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానించి ఇక్కడి నుంచే చర్చలు, సమావేశాలు జరుపుతామన్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదని, కానీ ముఖ్యమంత్రులకు ఒక అధికార నివాసం ఉండాలని కారణంతో కుమారకృప అతిథి గృహంలో 10 శాతాన్ని సీఎం నివాసంగా తీర్చిదిద్దామన్నారు. బెంగళూరులో సీఎంల కోసం కృష్ణా, కావేరి అధికార నివాసాలు కూడా ఉన్నాయి.
అతిథిగృహంలో కొంతభాగం మార్పు
సీఎం డీకే అధికార నివాసం ఇదే
పూజలు చేసి ప్రవేశం


