యశవంతపుర: జీవితాంతం కలిసే ఉంటామని బాసలు చేసిన భార్యాభర్తలు మరణంలోనూ అలాగే ఉన్నారు. తమ చేతులను చున్నీతో కట్టేసుకుని నదిలోకి దూకి ప్రాణాలు విడిచారు. ఉడుపి జిల్లా పాండేశ్వర దగ్గర సీతానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తుమకూరు జిల్లాకు చెందిన శ్రీనివాసమూర్తి (52), భార్య గంగా (48) మృతులు. హైవే– 66లో మూబుకళ వంతెనపై నుంచి ఇద్దరూ చేతులు బంధించుకుని నదిలోకి దూకారు. అది చూసిన ఓ ఆటో డ్రైవర్ చూసి ఉడుపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో ప్రవాహంలో మృతదేహాలు కొట్టుకుపోయాయి. దీంతో పోలీసులు, ఫైర్‌సిబ్బంది చాలాసేపు గాలించి బయటకు తీసుకొచ్చారు. భర్త డ్రైవరు, భార్య గార్మెంట్స్ ఉద్యోగిని అని తెలుస్తోంది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదు. ఉడుపి కోట పోలీసులు కేసు నమోదు చేసి బంధువులకు సమాచారమిచ్చారు.
పికాసితో భార్యను బాది...
భార్యపై అనుమానంతో పికాసితో బాది చంపేశాడో కిరాతక భర్త. బెంగళూరు మారతహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలోని పణత్తూరులో జరిగింది. బసవరాజు, దుర్గమ్మ (36) దంపతులు. 20 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాదం లో గాయపడిన బసవరాజు పనికి వెళ్లడం లేదు. దీనితో దుర్గమ్మ కుటుంబ పోషణకు ఇళ్లలో పనిచేసేది. ఆమెను అనుమానించే భర్త రోజూ గొడవపడేవాడు. ఇదేమాదిరిగా ఆదివారం అర్ధరాత్రి రగడ పడి పికాసిని తీసుకొని తలపై బాదడంతో దుర్గమ్మ అక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు.
ఉడుపి వద్ద దంపతుల ఆత్మహత్య


