మైసూరు: రాచనగరి మైసూరులో పచ్చదనాన్ని విస్తరించడం, పర్యావరణ సమతుల్యతను బలోపేతం చేసే లక్ష్యంతో నగరవ్యాప్తంగా 2 లక్షల మొక్కలను నాటే భారీ హరిత కార్యక్రమాన్ని శుక్రవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. మైసూరులోని కేసీ లేఅవుట్ పార్కులో స్వయంగా ఒక మొక్కను నాటి, దానికి నీరు పోసి, వన దేవతకు ప్రార్థనలు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మొక్కను ఒక వృక్షంగా పెంచడం మనందరి బాధ్యత అని ఆమె అన్నారు.’భారత్ వన్’ ప్రాజెక్టు కింద ఈ పార్కులో 4.5 ఎకరాల విస్తీర్ణంలో 45 వేల మొక్కలు నాటుతున్నారు. అదే విధంగా విజయనగర ఫేజ్– 4లోని ఆరు పార్కుల్లో హరితీకరణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖులు వర్చువల్‌గా ప్రారంభించారు. భారత్ వన్ పథకం ప్రధాన ప్రత్యేకత కేవలం మొక్కలు నాటడమే కాకుండా, నాటిన 2 లక్షల మొక్కలన్నింటినీ రాబోయే మూడేళ్లపాటు పోషించి, సంరక్షించే బాధ్యతలను అమలు భాగస్వామ్య సంస్థలు తీసుకున్నాయి. మైసూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య, లోక్‌సభ సభ్యుడు యదువీర్, స్థానిక ఎమ్మెల్యే టీ.ఎస్. శ్రీవత్స, శాసన మండలి సభ్యుడు మంజే గౌడ, పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్, మైసూరు జిల్లాధికారి జీ.లక్ష్మీకాంత్ రెడ్డి, మైసూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.కె.సవిత, ప్రభుత్వ అధికారులు, ఎస్‌బీఐ ప్రతినిధులు, వెయ్యి మందికి పైగా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
‘భారత్ వన్’లో
2 లక్షల మొక్కలు
నాటడమే లక్ష్యం
ప్రాజెక్టును
ప్రారంభించిన కేంద్ర మంత్రి
నిర్మలమ్మ


