రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య | - | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

దొడ్డబళ్లాపురం: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని దుండగులు అతని భార్య ఎదుటే దారుణంగా నరికి హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం యలహంక న్యూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. చెన్నపట్టణకు చెందిన చరణ్‌(40) యలహంకలోని కోగిలులో నివాసం ఉంటూ రామనగర, బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇతను తన భార్యతో కలిసి కారులో యలహంక న్యూటౌన్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎదుట ఉన్న తన ధణి ప్రాపర్టీస్‌ కార్యాయానికి బయల్దేరాడు. కారు దిగి ఆఫీసులోకి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. చరణ్‌ భార్య ఎంత వేడుకున్నా దుండగులు కరుణించలేదు. తీవ్రంగా గాయపడ్డ చరణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. యలహంక న్యూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement