ప్రధాని రోడ్‌ షో | - | Sakshi
Sakshi News home page

ప్రధాని రోడ్‌ షో

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

మైసూరు: దేశంలో తొలిసారిగా నిర్మించిన కాస్మోస్‌ ప్లానెటేరియంను ప్రారంభించేందుకు మైసూరుకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహిస్తూ అక్కడ గుమిగూడిన వేలాది మంది ప్రజలకు అభివాదం చేశారు. దారి పొడవునా పూల వర్షం కురిపించగా, కార్యకర్తలు మోదీకి అనుకూల నినాదాలు చేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేక సైనిక విమానంలో హోటల్‌ లలిత్‌మహల్‌ సమీపంలోని శశిరంజన్‌ మైదాన్‌లోని శ్రీజయచామరాజేంద్ర హెలిప్యాడ్‌కు చేరుకున్న మోదీకి గవర్నర్‌ డి.సుధా యాదవ్‌, ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ యతీంద్ర సిద్దరామయ్య, జిల్లాధికారి జి.లక్ష్మీకాంత్‌రెడ్డి, మైసూరు నగర పోలీస్‌ కమిషనర్‌ సీమా లాట్కర్‌ ప్రధానికి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ కారులో ఎక్కిన మోదీ, రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని రాక సందర్భంగా నగరంలోని ప్రధాన వీధుల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. కార్యకర్తలు ప్రధాన రహదారులపై, సర్కిళ్లలో బీజేపీ జెండాలను కట్టి నగరాన్ని కాషాయమయం చేశారు. మోదీ విమానం రాకను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. శశిరంజన్‌ మైదాన్‌లో హెలిప్యాడ్‌ను నిర్మించారు. అందువల్ల ఎవరూ దగ్గరకు రాకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement