చింతామణి: తాలూకాలోని నిమ్మకాయలపల్లి గ్రామంలోని బాబా దర్గా దగ్గర టపాసులు పేలుస్తుండగా ఆ ప్రాంతవాసులు వద్దని సూచించగా, వారిపై ఎదురుతిరిగి కత్తులతో హల్‌చల్ చేసిన ఇద్దరు కటకటాల పాలయ్యారు. నిందితులు కత్తులతో రోడ్డుపై తిరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. దీంతో బట్లపల్లి పోలీసులు గాలించి సదరు గ్రామస్తులు శశి, మంజు అని గుర్తించారు. దీపావళి రోజు వీరిద్దరూ లాంగ్ కత్తులు పట్టుకొని తిరుగుతూ ప్రజలను బెదిరిస్తున్నట్లు సీసీ కెమెరాలలో నమోదైందని పోలీసులు తెలిపారు. శశి, వీరికి కత్తులను సరఫరా చేసిన వజీర్‌ను అరెస్టు చేశారు. మంజు పరారీలో ఉన్నాడని తెలిపారు.


