వంశిక.. విధివంచిత | - | Sakshi
Sakshi News home page

వంశిక.. విధివంచిత

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

హుబ్లీ: చిన్నారి కుమార్తెను బతికించుకోవడానికి కన్నవారు ఎంతో శ్రమించారు, బాలిక ప్రాణం నిలబడాలని ఎంతోమంది ప్రజలు రక్తదానం చేశారు. రెండు రోజుల్లో 100 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అయినా విధి రాతకు తలవంచక తప్పలేదు. రక్త క్యాన్సర్‌తో పోరాడుతున్న పసిపాప తనువు చాలించిన విషాద ఘటన బెళగావిలో జరిగింది.

వందలాదిమంది ఆపన్న హస్తం

వంశిక శశికాంత హొసమని అనే నాలుగేళ్ల బాలిక అరుదైన రక్త క్యాన్సర్‌తో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు బెళగావిలోని కోరె ఎంఆర్‌సీ క్యాన్సర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. తరచూ రక్తం, ప్లేట్‌లెట్ల అవసరం పడేది. నిస్సహాయంగా ఉన్న పాప తల్లిదండ్రులకు ఇన్‌క్రెడిబుల్‌ బెళగావి ఫౌండేషన్‌ సభ్యులు సాయం అందించారు. సోషల్‌ మీడియాలోనూ పాప పరిస్థితి గురించి ప్రచారం జరిగింది. కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు. శంకర పాటిల్‌, జాన్సన్‌ డిసిల్వా సహకారంతో ఈ నెల 6, 7న విశేష రక్తదాన శిబిరం నిర్వహించగా వందమంది వదాన్యులు రక్తదానం చేశారు. ఈ స్పందన చూసి పాప తల్లిదండ్రుల కళ్లు చెమ్మగిల్లాయి. కానీ వ్యాధి పంజా విసరడంతో పాప సోమవారంనాడు ఆస్పత్రిలోనే కన్నుమూయడంతో తల్లిదండ్రులతో సహా నగరవాసులు విషాదానికి లోనయ్యారు.

బతికించుకోవాలని బెళగావి ప్రజల

విశ్వప్రయత్నం

అరుదైన రక్తక్యాన్సర్‌తో పోరాడుతూ బాలిక మృత్యువాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement