దేవీరమ్మ జాతరలో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

దేవీరమ్మ జాతరలో అపశ్రుతి

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

బనశంకరి: దీపావళి పండుగ సందర్భంగా చిక్కమగళూరు జిల్లాలోని మల్లెనహళ్లి పరిధిలో ప్రఖ్యాత చంద్రద్రోణ పర్వతం మీద కొలువైన దేవీరమ్మ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శనివారం సాయంత్రం నుంచే జిల్లాతో పాటు ఇరుగు పొరుగు జిల్లాలు, కేరళ, తమిళనాడు నుంచి కూడా ఇబ్బడిముబ్బడిగా యాత్రికులు రావడం మొదలైంది. ఆదివారం మరింత ఎక్కువ మంది వచ్చారు. యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల గోల సరేసరి. పిల్లలు, పెద్దలు కష్టమైనా కూడా ఎంతో ఇష్టంగా కొండను ఎక్కారు.

రైలింగ్‌ విరిగిపడి..

ఈ సమయంలో మధ్యలో ఓ చోట ఆసరాగా ఉండే ఇనుప గొట్టాల రైలింగ్‌ విరిగిపోవడంతో 25 మంది వరకూ భక్తులు ఒకరి మీద ఒకరు పడి గాయాల పాలయ్యారు. బాధితులకు చిక్కమగళూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరికి తీవ్ర గాయాలు తగిలాయి. గాయపడి నడవలేకపోయినవారిని కొందరు యువకులు, పోలీసులు కొండ పై నుంచి కిందకు తీసుకువచ్చి అంబులెన్సుల్లో తరలించారు. బాధితుల ఆర్తనాదాలతో విషాదం నెలకొంది. విపరీతంగా జనం తోసుకురావడమే ఘటనకు కారణమని అధికారులు చెబుతున్నారు.

రైలింగ్‌ కూలి ఒకరి మీద ఒకరు పడిన భక్తులు

25 మందికి పైగా గాయాలు

చిక్కమగళూరు జిల్లాలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement