బెంగళూరు మెట్రో పింక్ లైన్‌లో సేవలకు శ్రీకారం
ప్రధాని నరేంద్రమోదీ, డీఎం డీకే శివకుమార్ (ఫైల్)
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న బెంగళూరు, మైసూరు నగర ప్రాంతాలలో పర్యటించనున్నారు. బెంగళూరులో ఆయన ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తరువాత కాళేన అగ్రహార నుంచి తావరకెరెకు 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ వంతెనపై మెట్రో పింక్ లైన్‌లో రైలు సర్వీసుకు నాంది పలికి మెట్రో రైలులో ఐఐఎం స్టేషన్‌కు కూడా ప్రయాణిస్తారు. తరువాత మైసూరులో జరిగే భారత్ వన్ కార్యక్రమంలో, కాస్మోస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. దీంతో బెంగళూరులో కేంద్ర, రాష్ట్ర అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని పర్యటన ఇలా...
శుక్రవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో నిర్దేశిత ప్రాంతానికి వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి కుటీరానికి చేరుకొని, సంస్థ సువర్ణ మహోత్సవంలో పాల్గొంటారు. తరువాత హెలికాప్టర్‌లో 2వ ప్రదేశానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తావరకెరె మెట్రో స్టేషన్‌కు ప్రయాణించి, మెట్రో రైలు సర్వీసుకు జెండా ఊపి రైలులో ప్రయాణిస్తారు. బెంగళూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. తరువాత హెలికాప్టర్‌లో మైసూరుకు చేరుకుని పలు కార్యక్రమాలకు హాజరవుతారు. సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొంటారు. మైసూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని తిరుగు ప్రయాణమవుతారు.
మెట్రో పింక్ లైన్‌కు పచ్చజెండా సహా పలు కార్యక్రమాలకు హాజరు
తరువాత మైసూరుకు పయనం
చురుగ్గా పర్యటన పనులు


