బన్నేరుఘట్ట సున్నిత ప్రాంతంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

బన్నేరుఘట్ట సున్నిత ప్రాంతంపై దృష్టి

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలో ఆనేకల్‌ దగ్గరున్న బన్నేరుఘట్ట అటవీ ప్రాంతంలో పర్యావరణ సున్నిత ప్రాంతాలను నిర్ధారించడంలో కోర్టు ఉత్తర్వులను పాటిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బన్నేరుఘట్ట అడవిలోని నివాస ప్రాంతాలను తొలగించాలని అటవీ అధికారులు డిమాండ్‌ చేస్తుండడం తెలిసిందే. నివాస ప్రాంతాలు, ఎన్నో ఏళ్లుగా గ్రామాలు ఉన్న ప్రాంతాలలో పర్యావరణ సున్నిత ప్రాంతాలను 100 మీటర్లకు తగ్గించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు. మంగళవారం బన్నేరుఘట్ట జూపార్క్‌లో రూ 38 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. చాలా ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తే వారు ఇబ్బందులకు గురవుతారని ఆయన అన్నారు. కోర్టు తీర్పు, అధికారుల సలహా తీసుకున్న తర్వాత చర్యలు చేపడతామన్నారు.

కొత్త జంతువులను తెప్పిస్తాం

ఏటా 25 లక్షల మంది పర్యాటకులు బన్నేర్‌ఘట్ట పార్కును సందర్శిస్తారని, వారికి సౌకర్యాలు అవసరమని మంత్రి చెప్పారు. జూ సఫారీకి బ్యాటరీ వాహనాలను , పలు విభాగాలకు నూతన భవనాలను, జంతువుల ఎన్‌క్లోజర్‌లను ప్రారంభించారు. జూ పార్కుకు విదేశాల నుంచి జాగ్వార్లు, ప్యూమాలు, చింపాంజీలు, వాటర్‌డాగ్‌లను తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బి.శివన్న, ఎం.కృష్ణప్ప, ఎమ్మెల్సీ శరవణ, జూ అథారిటీ ఛైర్మన్‌ రంగస్వామి, అటవీ అధికారులు పాల్గొన్నారు.

100 మీటర్లు తగ్గించడానికి చర్చలు

మంత్రి రామలింగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement