సీరియల్‌ కిల్లర్‌ కూతురు మేజరే! | - | Sakshi
Sakshi News home page

సీరియల్‌ కిల్లర్‌ కూతురు మేజరే!

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

బనశంకరి: బెంగళూరు రాజాజీనగరలో భార్య, ఆమె తల్లి, బావమరుదుల కుటుంబాలను కడతేర్చిన సీరియల్‌ కిల్లర్‌ ఇందుశేఖర్‌, అతని కుమార్తె పై దర్యాప్తు కొనసాగుతోంది. ఆ బాలికకు ఇప్పుడు 18 ఏళ్లు నిండడంతో మేజర్‌ అని నిర్ధారణకు వచ్చారు. ఆ యువతిని మైనర్‌గా పరిగణించవద్దని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. మైనర్‌ అనే సాకుతో ఇంత ఘోరమైన నేరం నుంచి తప్పించుకునే వీలుందని పోలీసులు తెలిపారు. అలా జరగకుండా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో, హోం శాఖకు కూడా పిటిషన్‌ దాఖలు చేయాలని యోచిస్తున్నారు. సొంత తల్లి, అవ్వ తదితరుల హత్యలో ఆమె పాత్ర కూడా ఉందని గుర్తించారు.

శిరాడీఘాట్‌లో దంపతుల మృతదేహాలు

హాసన్‌ జిల్లా శిరాఢీ ఘాట్‌లోని మారనహళ్లి దగ్గర లోయలో పడేసిన ఇందుశేఖర్‌ బావమరిది శంకర్‌–నళిని దంపతుల మృతదేహాలను సోమవారం సాయంత్రం బెంగళూరు, సకలేశపుర పోలీసులు గాలించి స్వాధీనం చేసుకున్నారు. అతడు ఐదారు ప్రదేశాలను చూపించి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని చెబుతున్నారు. చివరకు మృతదేహాలను పడేసిన ప్రదేశం చూపించాడు. పోలీసులు తాళ్లతో సుమారు 100 అడుగుల లోతులోకి దిగి శవాలను వెలికితీసి హాసన్‌ ఆస్పత్రికి తరలించారు.

మైనర్‌గా పరిగణించ

కూడదంటున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement