యశవంతపుర: యువతులు, ఒంటరి మహిళలను మభ్యపెట్టి డబ్బు, బంగారం దోచేసే కిలాడీని బెంగళూరు చిక్క బాణావర పోలీసులు అరెస్టు చేశారు. హావేరి జిల్లా బ్యాడగికి చెందిన లింగరాజ్ (30) నిందితుడు. వివరాలు.. బీకాం చదివిన లింగరాజ్ పెళ్లి చేసుకొని భార్యకు విడాకులిచ్చారు. బీటీఎం లేఔట్‌లో బాడుగ ఇంటిలో ఉంటున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని మోసాలకు దిగాడు. మ్యాట్రిమొని వెబ్‌సైట్లు, యాప్‌లలో ఘనంగా ప్రొఫైల్‌ను రూపొందించుకున్నాడు. యువతులు, విడాకులు తీసుకున్న మహిళలకు గాలం వేసేవాడు. అతని ప్రొఫైల్ చూసిన మహిళలు సంప్రదిస్తే లింగరాజ్ మాయమాటలతో నమ్మించేవాడు. పరిచయమైన మూడు రోజులకే మహిళలకు అశ్లీల వీడియోలు పంపేవాడు. చిక్క బాణావరకు చెందిన మహిళ అతనిని నమ్మి ఇంటికి పిలిచింది. 100 గ్రాముల బంగారు నగలతో ఉడాయించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి 79 గ్రాముల బంగారంతో పాటు బైక్, మొబైల్ తదితరాలను సీజ్ చేశారు. మొబైల్‌ను పరిశీలించగా 8 నుంచి 10 మంది మహిళలను నమ్మించి మోసగించినట్లు బయట పడింది.
ఒంటరి మహిళలతో చెలగాటం


