జయంతిలో పాల్గొన్న వివిధ సంఘాల సభ్యులు
పూలమాల వేసిన ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి
రాయచూరు రూరల్: జిల్లాలో టిప్పుసుల్తాన్ 232వ జయంతిని మంగళవారం సరళంగా ఆచరించారు. టిప్పుసుల్తాన్ సర్కిల్ వద్ద అధ్యక్షుడు అక్బర్ నాగుండి వివిధ సంఘాల సభ్యులతో కలిసి టిప్పుసుల్తాన్ జయంతిని నిర్వహించారు. టిప్పుసుల్తాన్ సంఘం సంచాలకుడు హైఫరోజ్, వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు పఠాన్ మౌలా, మాసూమ్, నరసింహులు, కుమారస్వామి, విశ్వనాథ్ పట్టి పాల్గొన్నారు. సింధనూరులో ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి టిప్పుసుల్తాన్ చిత్రపటానికి పూలమాల వేసి టిప్పుసుల్తాన్ ప్రదర్శించిన సాహసాల గురించి కొనియాడారు.


