హోం వర్క్‌ చేయలేదని విద్యార్థిపై టీచర్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

హోం వర్క్‌ చేయలేదని విద్యార్థిపై టీచర్‌ దాడి

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

రాయచూరు రూరల్‌: పాఠశాలలో ఇచ్చిన హోం వర్క్‌ చేయలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటన కవితాళ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కవితాళ మదరసాలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి అయూబ్‌పై వీపు, ముఖంపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు అబ్బాస్‌పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు లింగసూగూరు డీఎస్పీ సులేమాన్‌ వెల్లడించారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

హుబ్లీ: హావేరి జిల్లాలో హావేరి– కర్జగి స్టేషన్ల మధ్య నాగేంద్రన మట్టి హొసనగర దగ్గర రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. సుమారు 30–35 ఏళ్ల వయస్సు, 5.5 అడుగుల ఎత్తు కలిగిన మృతుని ఆచూకీ తెలిసిన వారు హుబ్లీ రైల్వే పోలీసులను సంప్రదించాలని సంబంధిత రైల్వే సూపరింటెండెంట్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

బేడికిహాళ చక్కెర ఫ్యాక్టరీకి ప్రత్యేక ఘనత

● టన్ను చెరకుకు రూ.4200 ధర

సాక్షి,బళ్లారి: బెళగావి జిల్లా నిప్పాణి తాలూకా బేడికిహాళలో ఉన్న వెంకటేశ్వర చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రస్తుత సీజన్‌లో చెరకు సాగుదారులకు ప్రతి టన్ను చెరకుకు గరిష్టంగా రూ.4200 ధర చెల్లించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ధర ప్రకటించిన ఫ్యాక్టరీగా ఘనత సాధించింది. ఫ్యాక్టరీ పాలక మండలి మహారాష్ట్ర కర్మాగారాలు చెల్లించే ధర తరహాలోనే ధరను నిర్ణయించింది. ఈ మేరకు సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రతి టన్నుకు రూ.3800, రెండో వాయిదా పద్ధతిలో ప్రతి టన్నుకు రూ.100, అలాగే మూడో వాయిదాలో ప్రతి కేజీకి రూ.50 పెంచుతూ అదనంగా రూ.300 చెల్లించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర కర్మాగారాల ధరకు పోటీగా రైతులకు మేలు ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సదరు ఫ్యాక్టరీ పట్ల చుట్టుపక్కల చెరకు సాగు చేస్తున్న రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

రైల్వే సిబ్బంది నిజాయితీ

● రైలులో మరిచిన బ్యాగ్‌

యజమానికి అప్పగింత

హుబ్లీ: రైలులో ప్రయాణికులు మరిచి వెళ్లిన బ్యాగులో రూ.52,500 నగదు, రెండు పాస్‌పోర్టులు, విదేశీ కరెన్సీని రైల్వే సిబ్బంది స్వాధీనపరచుకుని సురక్షితంగా వారసుదారులకు అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. బెంగళూరు నుంచి బెళగావికి ఈ నెల 8న రాణిచెన్నమ్మ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన అర్జున్‌, ఆయన భార్య అశ్విని ఏసీ కోచ్‌లో బ్యాగ్‌ మరిచి వెళ్లారు. ఆ సమయంలో రైలులో డ్యూటీలో ఉన్న బెడ్‌రోల్‌ సిబ్బంది లఘుమన్నకు ఆ బ్యాగ్‌ దొరికింది. తక్షణమే దాన్ని సంబంధిత స్లీపర్‌ డిపో ఇన్‌చార్జి రంగనాథ్‌, సీనియర్‌ టీసీ విశ్వనాథ్‌కు అప్పగించారు. ఆ తర్వాత వారిద్దరూ ఆ బ్యాగ్‌లో ఉన్న వివరాల ఆధారంగా ప్రయాణికులను గుర్తించి ఆ బ్యాగ్‌ దొరికిన విషయాన్ని సంబంధించిన విభాగానికి తెలియజేశారు. ఆ రోజు శాడ్లియా నుంచి బెంగళూరుకు వెళుతున్న రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్‌ బెళగావి స్టేషన్‌కు రావడంతోనే టికెట్‌ కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌, బెడ్‌రోల్‌ సిబ్బంది సహకారంతో ఆ బ్యాగ్‌ను యజమాని అర్జున్‌కు సురక్షితంగా అప్పగించారు. దీంతో అర్జున్‌ దంపతులు ఆ బ్యాగ్‌లో ముఖ్యమైన రికార్డులు, నగదు చూసి రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక సదరు సిబ్బంది నిజాయితీకి నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్‌ ప్రశంసలు కురిపించింది.

అగ్ని ప్రమాదంలో అంగడి బుగ్గి

హుబ్లీ: స్థానిక న్యూ కాటన్‌ మార్కెట్‌ మౌర్య ట్రేడర్స్‌ అంగట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగరాజ్‌కు చెందిన ఈ అంగట్లో దీపావళి పూజలు చేసి అంగడిని బంద్‌ చేసుకొని వెళ్లిపోయారు. చాలా సేపటి తర్వాత అంగట్లో నుంచి పొగలు రావడం కనిపించింది. దీంతో చుట్టు పక్కల వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది విచ్చేసి మంటలను ఆర్పారు. కాగా అంగట్లో కార్పెంటరీ పని కోసం సంబంధిత సామగ్రి ఉందని, అందుకే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు హుబ్లీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement