మద్దతు ధర కోసం రైతన్న పోరుబాట | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర కోసం రైతన్న పోరుబాట

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో అధికంగా చెరకు పంట పండించే బెళగావి జిల్లాలో రైతులు తాము పండించిన చెరకుకు మద్దతు ధర ప్రకటించాలంటూ రోడ్డెక్కారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తోడు రెక్కాడితే కాని డొక్కాడని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏడాది పాటు పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కోసం పారిశ్రామికవేత్తలు, సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహారాష్ట్రలో చెరకు నియంత్రణ మండలి ఉంది. ఆ ప్రాంతంలో రైతులకు రూ.3,200 ధర లభిస్తోంది. కర్ణాటకలో చెరకు నియంత్రణ మండలి ఉన్నా ఫలితం లేకుండా పోయిందనే భావన రైతుల్లో నెలకొంది. రాష్ట్రంలో చెరకు నియంత్రణ మండలి రైతుల తరఫున కాకుండా కేవలం పారిశ్రామికవేత్తలకు తొత్తుగా మారిందని, రైతులకు మరణ శాసనంగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రతి టన్నుకు రూ.3,500 ధర కేటాయించాలని రైతులు పట్టుబట్టారు. బెళగావి జిల్లాలో 2.90 లక్షల హెక్టార్లలో చెరకును పండించారు. గతంలో జిల్లాలో 29 చెరకు పరిశ్రమలకు కోటి 7 లక్షల 91 వేల 376 టన్నుల చెరకును పంపగా దీని నుంచి 8 లక్షల 77 వేల 357 టన్నుల చక్కెరను ఉత్పత్తి చేశారన్నారు. 2024–25లో 81 చెరుకు పరిశ్రమలకు 5 కోట్ల 40 లక్షల టన్నుల చెరకును పంపగా, దీని నుంచి 41 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. కేంద్రం మెట్రిక్‌ టన్ను చెరకుకు రూ.3,550 మద్దతు ధర ప్రకటించింది.

చక్కెర పరిశ్రమల వివరాలు:

బెళగావి జిల్లాలో 22 పరిశ్రమల్లో రైతులకు ప్రతి టన్నుకు ఎఫ్‌ఆర్‌సీ ప్రకారం రూ.4,076 ధర ఉండగా అథణిలో రూ.3,758, చిదానందలో రూ.3,969, ఘటప్రభలో రూ.3,823, గోకాక్‌లో రూ.3,941, మలప్రభలో రూ.3,844, లైలాలో రూ.3,287, బాగల్‌కోటె జిల్లాలో 14 చక్కెర పరిశ్రమల్లో రూ.3,803, బీళగిలో రూ.3,609, ఇండిలో రూ.4,111, జమఖండిలో రూ.3,773, ముధోళలో రూ.3,775, బాదామిలో రూ.3,768 చొప్పున ధరలు పలుకుతున్నాయి. విజయపురలో 10, బీదర్‌, కలబుర్గి జిల్లాల్లో ఐదు, హావేరిలో మూడు, మండ్యలో ఐదు చక్కెర పరిశ్రమలున్నాయి.

సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు

81 చక్కెర పరిశ్రమల్లో తగ్గిన ఉత్పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement