ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు గ్రహణం

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

రాయచూరు రూరల్‌: ఉత్తర, కళ్యాణ కర్ణాటక ప్రాంతాల రైతులకు జీవనాడి కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 30 ఏళ్లుగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు మూడో విడత జారీ అవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 524 మీటర్ల నుంచి 522 మీటర్లకు కుదించడానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు 173 టీఎంసీల మిగులు జలాల్లో 130 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశం లభించింది.

ఎత్తు పెంచితే 13.10 లక్షల ఎకరాలకు నీరు

డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచితే 9 నూతన నీటి పథకాల ద్వారా కలబుర్గి, రాయచూరు, కొప్పళ, విజయపుర, యాదగిరి, బాగల్‌కోటె, గదగ్‌ జిల్లాల్లో 13.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం లభిస్తుంది. విజయపురలో రెండు, బాగల్‌కోటె జిల్లాలో 20 గ్రామాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాలువల నిర్మాణ పనులకు 96 వేల ఎకరాలు, పునర్వసతికి 1.36 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకోడానికి కేబీజీఎన్‌ఎల్‌ అధికారులు ిసిద్ధంగా ఉన్నారు. ఈ పథకం పూర్తి చేయడానికి రూ.లక్ష కోట్ల నిధులు అవసరం. అప్పట్లో 3 వేల ఎకరాలకు పరిమితంగా ఉండేది. నేడు 30 లక్షల ఎకరాల భూములకు సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి, నీటి వినియోగం అధికంగా అవసరం ఉంటుంది. ఆల్మట్టి డ్యాంలో 130 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 2013 నుంచి 2018 వరకు అప్పటి సీఎం సిద్దరామయ్య సర్కార్‌లో రూ.7,795 కోట్లు, సంకీర్ణ సర్కార్‌లో రూ.1,079 కోట్లు, బీజేపీ సర్కార్‌లో రూ.6,407 కోట్ల నిధులు కేటాయించారు.

30 ఏళ్లుగా అడుగు ముందుకు

పడని వైనం

519 నుంచి 524 మీటర్లకు

పెంపు ప్రతిపాదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement