కరువు పరిహారంలో పక్షపాతం | - | Sakshi
Sakshi News home page

కరువు పరిహారంలో పక్షపాతం

Nov 11 2026 12:31 AM | Updated on Nov 11 2026 12:31 AM

సాక్షి,బళ్లారి: కరువుతో అల్లాడిపోతున్న రైతులకు ఇచ్చే పరిహారంలో కూడా పక్షపాతం చూపడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కరువు పరిహార నిధుల్లో కూడా నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహార మొత్తానికి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసిన మొత్తానికి తేడా కనబడుతోంది. రైతులను ఆదుకోడానికి రూ.5000లు కరువు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం తొలి వాయిదాగా రైతులకు ఒక్కొక్కరి ఖాతాలకు రూ.2500 విడుదల చేసింది. అయితే యాదగిరి జిల్లాలో ఒక్కొక్క రైతుకు ఒక్కో విధంగా డబ్బులు జమ అయ్యాయి. కొందరికి కేవలం రూ.1500లు జమ కాగా, మరికొందరికి రూ.2 వేలు, ఇలా తారతమ్యం చూపడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రైతు ఖాతాకు ఒక్కొక్క రీతిగా పరిహార సొమ్ము జమ అయింది. ప్రభుత్వం ప్రకటించిన సొమ్ము పూర్తిగా రైతుల చేతికి అందడం లేదని అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తొలి విడతగా రూ.2500 పరిహారం చెల్లిస్తామని, రెండో విడతలో మరో రూ.2500 చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో ఒకేసారి రూ.5 వేలు చేతికందుతాయని ఆశపడిన అన్నదాతలకు నిరాశ మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement