సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యమేల? | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యమేల?

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు చెందిన అస్మిత విద్యార్థినుల వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌.నాగలక్ష్మి చౌదరి స్వయంగా హాస్టల్‌కు వచ్చి సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. అధికారులు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదంలో

గుర్తు తెలియని వ్యక్తి మృతి

హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి మృతి చెందాడు. ఈ ఘటన హుబ్లీ నవళగుంద రోడ్డులోని కిరేసూరు గ్రామంలో చోటుచేసుకుంది. 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పాల ధరలు తగ్గించాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకపక్షంగా పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని కరవే నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కరవే జిల్లా అధ్యక్షుడు వీరేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఆర్టీసీ బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పాల ధరలతో పాటు ఆర్టీసీ చార్జీల పెంపును వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

కళలకు తగ్గుతున్న ఆదరణ

రాయచూరు రూరల్‌: అంతరించిపోతున్న రంగస్థల కళలకు తిరిగి ప్రాణం పోయాలని సీనియర్‌ కవి హక్కి కోరారు. గురువారం రాత్రి పండిత సిద్ధరామ జంబలదిన్నె రంగమందిరంలో రంగసిరి కళాసంఘం, వీధి నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీవీలు, మొబైల్‌ ఫోన్ల వినియోగం లేని రోజుల్లో నాటక రంగ కళలకు ఎంతో ప్రాధాన్యత ఉండేదని తెలిపారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత కాలంలో సంప్రదాయ రంగస్థల కళలకు ఆదరణ తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుమరుగవుతున్న కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అశోక్‌ జైన్‌, జగదీష్‌, చంద్రశేఖర్‌ పాటిల్‌, నాగేంద్రప్ప, బసవలింగప్ప, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement