విజయపురలో మళ్లీ పేలిన తుపాకులు | - | Sakshi
Sakshi News home page

విజయపురలో మళ్లీ పేలిన తుపాకులు

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

రాయచూరు రూరల్‌: కర్ణాటకలోని విజయపుర నగరంలో మరోసారి గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. గురువారం సాయంత్రం నడిరోడ్డుపై జరిగిన కాల్పుల్లో యాసిన్‌ జుబేరి అలియాస్‌ యాసిన్‌ ఠక్కా (34) అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగిందని జిల్లా ఎస్పీ లక్ష్మణ్‌ నింబరిగి ప్రాథమికంగా ధ్రువీకరించారు. వివరాలు ఇలా.. విజయపుర తాలూకా ఠక్కె గ్రామానికి చెందిన యాసిన్‌.. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై నగరంలోని ముండేవాడి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వస్తున్న సమయంలో ఆసుపత్రి సమీపంలోనే బైక్‌పై ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డుకున్నారు. యాసిన్‌పై పాయింట్‌ బ్లాంక్‌లో రెండు నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్లు బలంగా దూసుకుపోవడంతో యాసిన్‌ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో డీజే వివాదానికి సంబంధించిన మనస్పర్ధలను మనసులో పెట్టుకుని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న గాంధీ చౌక్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement