రాష్ట్ర స్థాయి పోటీలకు బళ్లారి విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు బళ్లారి విద్యార్థులు

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

బళ్లారిఅర్బన్‌: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కర్ణాటక రాష్ట్ర సంస్థ ఆధ్వర్యంలో నవంబర్‌ 4న నిర్వహించిన కలబుర్గి డివిజన్‌ స్థాయి పోటీల్లో బళ్లారి జిల్లా విద్యార్థులు రాణించారు. బళ్లారిలోని సరళాదేవి సతీష్‌ చంద్ర అగర్వాల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోవర్స్‌ విభాగం విద్యార్థులు జానపద గీతాలాపన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సండూరు తాలూకా తోరణగల్లులోని జిందాల్‌ ఆదర్శ విద్యాలయ విద్యార్థులు దేశభక్తి గీతాలాపన పోటీల్లో తృతీయ స్థానం సాధించారు. ఈ పాఠశాలకు చెందిన కబ్‌, బుల్బుల్‌ విభాగాల విద్యార్థులు కూడా పోటీల్లో మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నారు. విజేత విద్యార్థులను కళాశాల, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు అభినందించారు.

కసాప సమ్మేళన

సర్వాధ్యక్షుడికి సన్మానం

రాయచూరు రూరల్‌: నగరంలో ఈనెల 14 నుంచి రెండు రోజుల పాటు జరిగే కన్నడ సాహిత్య పరిషత్‌(కసాప) 12వ జిల్లా సమ్మేళన సర్వాధ్యక్షుడు రామణ్ణ హవళెను గురువారం జిల్లా సమ్మేళనం కార్యాధ్యక్షుడు బోసురాజు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏ.పాపారెడ్డి, రంగణ్ణ పాటిల్‌, శాంతప్ప, జయన్న, వీర హనుమాన్‌, రావుత్‌ రావ్‌, సంతోష్‌, బాబు భండారిగళ్‌, తాయప్ప, దండెప్పలున్నారు.

ఘనంగా విజయేంద్ర జన్మదిన వేడుక

సాక్షి,బళ్లారి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై. విజయేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయేంద్ర రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని, ఆయన మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకులు ఐనాథరెడ్డి, రామలింగప్ప, హంపీ రమణ తదితరులు పాల్గొన్నారు.

ఎడమ కాలువకు నీరు వదలండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు వదలాలని ఒత్తిడి చేస్తూ కాలువలపై రైతులు, నేతలు ఆందోళన చేపట్టారని, కాలువలకు వార బందీ పద్ధతి ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విధాన పరిషత్‌ సభ్యుడు బాదర్లి బసనగౌడ విన్నవించారు. బుధవారం రాత్రి బెంగళూరులో సీఎం డీ.కే.శివకుమార్‌ను మంత్రి శివరాజ తంగడిగితో కలిసి చర్చించి కాలువల వద్ద ఆందోళన చేపట్టిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఎడమ కాలువ కింద ఆయకట్టు పరిధిలో ఇప్పటికే ఏపుగా పెరిగిన పంటలు ఎండుముఖం పట్టడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సీఎంకు తెలిపారు. కాలువకు నీరు వదిలి పంటలను కాపాడి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని సీఎంకు మంత్రి, ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు.

కన్నడ భాషను ప్రోత్సహిద్దాం

రాయచూరు రూరల్‌: కన్నడ భాషను ప్రోత్సహిద్దామని అఖిల కర్ణాటక జెస్కాం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపి పేర్కొన్నారు. కర్ణాటక జెస్కాం ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ వేడుకను ప్రారంభించి మాట్లాడారు. కన్నడలో మాట్లాడటం ద్వారా భాషాభివృద్ధికి తమ వంతు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement