బళ్లారిఅర్బన్: నగరంలోని ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీఓ) కార్యాలయంపై గురువారం లోకాయుక్త అధికారులు ఆకస్మిక దాడి చేశారు. కార్యాలయంలోని వివిధ విభాగాల్లో ఫైళ్లు, కీలక పత్రాలను పరిశీలించారు. బెంగళూరుకు చెందిన లోకాయుక్త డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో 15 మంది అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా కార్యాలయ పాలన వ్యవహారాలు, పెండింగ్ ఫైళ్లు, అనుమానాస్పద పత్రాలను పరిశీలించి, సిబ్బందిని విచారించినట్లు సమాచారం. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగడంతో కార్యాలయం వద్ద ఆందోళన నెలకొంది. తనిఖీల్లో లభించిన సొమ్ము, స్వాధీనం చేసుకున్న పత్రాల వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఫైళ్లు, కీలక పత్రాల తనిఖీ
క్షుణ్ణంగా సిబ్బంది విచారణ


