పాల ధర పెంపుపై మహిళాగ్రహం | - | Sakshi
Sakshi News home page

పాల ధర పెంపుపై మహిళాగ్రహం

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలిలో పాల ధరల పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్ఛా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పాల ధరను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు పాల ధరల పెంపు పేద కుటుంబాలపై మరింత ఆర్థిక భారం మోపుతోందని బీజేపీ నాయకులు అన్నారు. పెంచిన పాల ధరను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే నందిహళ్లి హాలప్పతో పాటు పలువురు బీజేపీ నాయకులు, మహిళా మోర్ఛా నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెంచిన ధరను వెంటనే విరమించాలి

హూవినహడగలిలో భారీ నిరసన ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement