రాయచూరు రూరల్: జిల్లాలో భూ రికార్డుల్లో జరిగిన తప్పులను సరిదిద్దాలని విద్యా సంఘం పోరాట సమితి అధ్యక్షురాలు రూప డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. జిల్లా భూ మాపన అధికారి పేదవారి భూములను అక్రమంగా తమ పేరు మీద రాయించుకున్న వాటిని రద్దు చేయాలన్నారు. సర్వే నంబర్– 911–7 లో 6 సెంట్ల భూమిని 4 సెంట్ల భూమిగా రికార్డుల్లో తప్పుగా నమోదు చేశారని, దానిని సరి చేయాలన్నారు. అక్రమంగా తమ పేరు మీద రాయించుకున్న భూములను తిరిగి పేదల పేరిట చేర్చాలని కోరుతూ జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు.


