వీడిన రూ.2.68 కోట్ల దోపిడీ మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

వీడిన రూ.2.68 కోట్ల దోపిడీ మిస్టరీ

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

సాక్షి,బళ్లారి: రూ.లక్ష నగదు ఇస్తే మీ బ్యాంకు ఖాతాకు రూ.1.30 లక్షలు తిరిగి జమ చేస్తామని ఘరానా మోసగాళ్లు అమాయకులను నమ్మించారు. దీనిని నమ్మి ఐదు మంది కోట్లాది రూపాయలను పోగొట్టుకున్నారు. ఈ దోపిడీ కేసులో బెళగావి జిల్లా మూడలగి పోలీసులు ఘరానా మోసగాళ్ల ఆటకట్టించి రూ.2.68 కోట్ల భారీ దోపిడీ కేసును ఛేదించారు. బెళగావి జిల్లా మూడలగి పోలీసులు ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి, రూ.2.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు 8 మందిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. రూ.లక్ష నగదు ఇస్తే మీ ఖాతాలోకి రూ.1.30 లక్షల నగదు తిరిగి జమ చేస్తామని నమ్మించడంతో దాదాపు రూ.2.68 కోట్ల నగదు మోసపూరిత దోపిడీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బెళగావి జిల్లా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. జిల్లాలోని మూడలగి తాలూకా సంగనకేరి గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ చిదానంద సిద్ధారూడ కురబేట్‌, రాజారాం సురేష్‌ మాలవగోళ, రమేష్‌ దుండప్ప మాలవగోళ, విఠల సురేష్‌, రామప్ప అరభావి, మారుతీ అరభావి, గోకాక్‌ ప్రకాష్‌ రామలింగప్ప, రాఘవేంద్ర అరెస్టయిన నిందితులు.

పథకం ప్రకారమే కంట్లో కారం కొట్టి..

డబ్బులు లెక్కించేటప్పుడు పథకం ప్రకారం నిందితులైన మారుతీ, సంజు, రాజారాం తదితర ఐదు మంది అక్టోబర్‌ 30వ తేదీ రాత్రి కారంపొడి తీసుకుని షెడ్డులోకి ప్రవేశించి చెన్నబసప్ప కంట్లోకి కారంకొట్టి, దౌర్జన్యం చేసి ఐదు బ్యాగుల్లో ఉంచిన రూ.2.68 కోట్లను దోపిడీ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో వివరించారు. దీంతో రంగంలోకి దిగిన మూడలిగి పోలీసులు కేసు మిస్టరీని పూర్తిగా చేధించారు. చిదానంద కుట్ర మేరకు తొమ్మిది మంది నిందితులు డబ్బులు దోచుకోవాలని షెడ్డులో లెక్కించేటప్పుడు దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఈ కేసులో పాలు పంచుకున్న మరో నిందితుడు పరారీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన రికవరి కావాల్సిన నగదును కూడా స్వాధీనం చేసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. బెళగావి జిల్లా గోకాక్‌ చుట్టుపక్కల ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధిక వడ్డీ ఆశ చూపించి దుండగులు అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసుల తనిఖీలో ఈ ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.

దోపిడీ కేసులో అరెస్టయిన నిందితులు, జప్తు చేసిన నగదుతో పోలీసులు

పోలీసులు స్వాధీనపరచుకున్న నగదు కట్టలు

8 మంది ఘరానా నిందితుల అరెస్ట్‌

ఛేదించిన బెళగావి జిల్లా పోలీసులు

రూ.2.39 కోట్ల నగదు స్వాధీనం

గత అక్టోబర్‌ 30న జరిగిన ఈ దోపిడీపై మూడలగికి చెందిన కల్మేష బసవరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మేరకు 8 మంది నిందితులను అరెస్ట్‌ చేసి, రూ.2.39 కోట్ల నగదు, రెండు బైకులు, ఒక కారు, డబ్బులు లెక్కించే యంత్రాలతో పాటు ముఠా వాడిన వివిధ వస్తువులను జప్తు చేశారు. నిందితుడు చిదానంద కురబేట్‌ తమకు రూ.లక్ష చెల్లిస్తే మీ బ్యాంకు ఖాతాలకు రూ.1.30 లక్షలు జమ చేస్తామని ప్రజలను ప్రలోభపెట్టారు. నమ్మిన తాను ముందుగా రూ.48 లక్షలు, మేనమామ చెన్నబసప్ప రూ.40 లక్షలు, బీరప్ప రూ.50 లక్షలు, కల్మేష రూ.50 లక్షలు, శంకర్‌ రూ.80 లక్షలు మొత్తం కలిపి రూ.2.68 కోట్లను చెల్లించామని ఫిర్యాదు దారుడు కల్మేష్‌ బసవరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. నిందితుడు చిదానంద ఈ డబ్బులను పనిగట్టుకుని దురుద్దేశ్యంతో దోపిడీ చేయాలన్న దురాశతో ఆ డబ్బులను షెడ్డులో లెక్కపెడదామని నమ్మించి బీరప్ప అనే వ్యక్తి షెడ్డుకు డబ్బును తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement